హెల్త్ కేర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగూడెం అర్బన్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్), అపోలో మెడ్ స్కిల్స్ సంయుక్తాధ్వర్యంలో హెల్త్ కేర్ అసిస్టెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ డ్యూటీ ఆఫ్ అసిస్టెంట్(జీడీఏ), ఫార్మసీ అసిస్టెంట్ కోర్సులకు మూ డు నెలలపాటు ఇచ్చే శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. జీడీఏ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత, 18-35 సంవత్సరాల వయసున్న వారు; ఫార్మసీ అసిస్టెంట్ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణత, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. హైదరాబాద్‌లోని న్యాక్ సెంటర్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు-3, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్తో ప్రగతి మైదాన్‌లోని కేఎస్‌డీసీ కార్యాలయంలో ఇవ్వాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 92926 50982, 83286 22455 నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.