అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu ) పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు ఆదివారం జన్మదిన( Birthday ) శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్‌షా, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బర్త్‌డే విషెస్ చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan kalyan) , వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) ట్విటర్ వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
పవన్‌కల్యాణ్, చిరంజీవి ఎక్స్‌వేదిక ద్వారా చంద్రబాబుకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి కలిగిన నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్ణమంటూ కొనియాడారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం, ఉన్న గొప్ప నాయకులంటూ ప్రశంసించారు.
చంద్రబాబు అనితర సాధ్యుడంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలంటూ పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తు అంచనా వేసి వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని అన్నారు.