న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి (No-confidence motion) వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ (YCP) వ్యతిరేకంగా ఓటేయనుంది. ప్రధాని మోదీకి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) కొనసాగుతున్న అల్లర్ల అంశంపై ప్రధాని మౌనం వీడాలని, పార్లమెంటులో (Parliament) ప్రకటన చేయాలంటూ పట్టుబడుతూ వస్తున్న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 26 పార్టీలతో కూడిన ఇండియా (INDIA) కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్ గత బుధవారం ఈ నోటీసులు అందజేశారు. అవిశ్వాస తీర్మానానికి లోక్సభ స్పీకర్ ఓ బిర్లా సమ్మతించారు. అయితే అది సభ ముందుకు ఎప్పుడు రానుందనే అంశంపై ఇంకా స్పష్ట రాలేదు. కాగా, ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
కాగా, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిచ్చేది లేదని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి లాభం ఏంటని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రెండు శత్రు దేశాలు కాచుకుని కూర్చున్న వేళ, మణిపూర్ అడ్డుకుతున్న సమయంలో కేంద్రాన్ని బలహీన పర్చాలని చూడటం జాతి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. ఇది అందూ కలిసి పనిచేయాల్సిన సమయమని, పరస్పరం వ్యతిరేకంగా పనిచేయాల్సిన టైం కాదన్నారు. అందువల్ల తాము అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసి కేంద్రానికి మద్దతుగా నిలుస్తామని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. అదువిధంగా వచ్చేవారం రాజ్యసభ ముందుకు రానున్న ఢిల్లీ అధికారాల బిల్లుకు కూడా మద్దతు తెలుపనున్నది. అయితే ప్రతిపక్షాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.