అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన వైసీపీ ఎంపీపీ ప్రసన్నలక్ష్మి మృతి చెందారు. గత సంవత్సరం తేలటూరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఉంగుటూరు ఎంపీపీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నిన్న ఎంపీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో పడడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడ్డ ఎంపీపీ ప్రసన్నలక్ష్మి ని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది. ఆమె మృతి పట్ల వైసీపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.