Jogi Ramesh | నా ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ తెలిపారు. టీడీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో విధ్వంసకాండ జరుగుతోందని అన్నారు. ఎప్పుడూ జరగని దాడులు, దహనకాండలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు, లోకేశ్ నేతృత్వంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని జోగి రమేశ్ తెలిపారు. ఆ ఘటన మరిచిపోకముందే నా ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నన్ను హత్య చేయాలని అనుకుంటున్నారేమో తెలియదని వ్యాఖ్యానించారు. లోకేశ్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి రౌడీ మూకలను రంగంలోకి దించారని ఆరోపించారు. పెట్రోలు బాంబులు, రాడ్లతో దాడిచేస్తున్నారని అన్నారు. వైసీపీని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
లోకేశ్ రాక్షాసానందం, పిల్ల చేష్టలు మానుకోవాలని జోగి రమేశ్ హితవు పలికారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదు.. ఎన్టీఆర్ పార్టీ అన్నాను, లోకేశ్ ఒళ్లు తగ్గింది బుర్రపోయింది అన్నాను.. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మీరు మాపై ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా అని గుర్తుచేశారు. జోగి రమేశ్ ఇంటిపై దాడిని వైసీపీ నేత చెవిరెడ్డి ఖండించారు. వైసీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి మీవరకు వచ్చేలా చేసుకుంటున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు.
Visuals at Jogi Ramesh House ! pic.twitter.com/RYT7k7NAJe
— YSRCP Europe (@YSRCPEurope) February 1, 2026
బ్రేకింగ్
బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ శ్రేణులు
ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరినట్లుగా అనుమానం
కాలిపోతున్న జోగి రమేష్ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ https://t.co/v5kmc0C84q pic.twitter.com/UtJ2nCpiqF
— Telugu Feed (@Telugufeedsite) February 1, 2026