Bhumana Karunakar Reddy | తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ నేతలు సృష్టించిన విధ్వంసంపై టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీవైపే ఉన్నారని తెలిపారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు.. వైసీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వైసీపీ కార్పొరేటర్లపై కూటమి నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. అర్ధరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారని తెలిపారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురిచేశారని చెప్పారు. ఇదేనా మహిళల పట్ల మీకు ఉన్న గౌరవమని నిలదీశారు.
వైసీపీ తరఫున గెలిచిన 48 మంది కార్పొరేటర్లలో పలువుర్ని బెదిరించి, భయపెట్టి వారివైపునకు తిప్పుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తమ కార్పొరేటర్లను బెదిరించి, బస్సులో వెళ్లిన వారిని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. నలుగురు కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారో.. ఏమయ్యారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో వైసీపీ విజయం సాధించేది కాబట్టి, కూటమి గెలిచే పరిస్థితి లేదని భావించి.. ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలని కోరారు.
తిరుపతిలో ప్రజాస్వామ్యానికి కూటమి నేతలు సమాధి కట్టేశారు
తిరుపతిలోని కార్పొరేటర్లను మున్సిపల్ అధికారులు, పోలీసులతో బెదిరించి.. కూటమికి మెజార్టీ లేకపోయినా డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకోవాలని కుట్ర చేస్తున్నారు
రెడ్ బుక్ రాజ్యాంగం అండ చూసుకుని కూటమి నేతలు ఇలా… pic.twitter.com/9RbNZARm7R
— YSR Congress Party (@YSRCParty) February 3, 2025