Konaseema | ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మాతృమూర్తి. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ముగ్గురు పిల్లలు జన్మించడం విశేషం. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రాజనగరం మండలం పాత తుంగపాడు గ్రామానికి చెందిన ఆలపాటి సంధ్యా కుమారి, వీరబాబు దంపతులకు పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలైంది. పిల్లల కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగి చికిత్స తీసుకున్నారు. అయినా, పిల్లలు కాలేదు. చివరి ప్రయత్నంలో రామచంద్రపురంలోని బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే సంధ్య గర్భం దాల్చింది. సంధ్య కుమారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేశారు. ఇద్దరు మగ పిల్లలు, ఓ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. తల్లితో పాటు ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని.. పుట్టిన సమయంలో ఎంతైతో బరువు ఉండాలో.. అంతే బరువుతో ఉన్నారని వైద్యుడు గిరిబాల తెలిపారు.