Pothina Mahesh | బీసీలకు మంచి చేస్తారా? లేదా వారిని మోసం చేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ ప్రశ్నించారు. జనాభాలో సగం తెలుగుదేశంతో మనం.. ఇది ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం టీడీపీ చేసిన క్యాంపెయిన్ స్లోగన్ అని గుర్తుచేశారు. దీన్ని ఆధారంగా చేసుకునే బీసీలకు రక్షణ చట్టం అనే హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనాభాలో సగం బీసీలను మరిచిపోయారా? లేక బీసీలు సగం కన్నా తక్కువైపోయారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.
జనాభాలో సగం అని చెప్పి మీ ప్రభుత్వంలో బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారని పోతిన మహేశ్ ప్రశ్నించారు. టీటీడీలో గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరించి బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా? లేదా? అని నిలదీశారు. ఒకప్పుడు మీరు తీసుకొచ్చిన రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను ఇప్పుడు ఒక్కటికే ఎందుకు పరిమితం చేశారని అడిగారు. మీ రాజకీయ పొత్తుల కంటే బీసీలు తక్కువైపోయారా అని మండిపడ్డారు. బీసీ సామాజికవర్గం వారు రాజీనామా చేసిన రాజ్యసభ సీట్లను అదే సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్చేశారు. బీసీలను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. కనీసం సమానంగా చూస్తే చాలని అన్నారు.
చంద్రబాబు నాయుడు గారు @AndhraPradeshCM బీసీలకు మంచి చేస్తారా? మోసం చేస్తారా?
జనాభాలో సగం తెలుగుదేశంతో.@JaiTDP మనం ఇది ఎన్నికలకు ముందు మీరు BC ల ఓట్లకోసం చేసిన కాంపెయిన్ స్లోగన్. దీన్ని బేస్ చేసుకునే BC లకు రక్షణ చట్టం అని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక జనాభాలో సగం బీసీ లను… pic.twitter.com/b7UmnbSTbC
— Pothina venkata mahesh (@pvmaheshbza) October 14, 2024