ఏపీలో దారుణం జరిగింది. అస్తమానం ఫోన్లో మాట్లాడుతున్న భార్యను మందలించినందుకు భర్తపై పగ పెంచుకుంది ఓ ఇల్లాలు. ఫోన్లో మాట్లాడుతున్న ప్రతిసారి ఈయన పెత్తనమేంది అనుకున్న భార్య తాను కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా నరికి చంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో భార్య దేవి రోజు ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడుతుందని.. ఎవరితో అంత సేపు మాట్లాడుతున్నావని, నీకు పని పాట లేదా?, ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతున్నావని మందలించిన భర్త రాజారావు(45).
దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. కోపం పెంచుకున్న దివి నిద్రిస్తున్న భర్తను తలపై గొడ్డలితో నరికింది. తీవ్రంగా గాయపడిన రాజారావును కొడుకు, కూతురు చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. రాజారావు పరిస్థితి విషమంగా మారడంతో వైజాగ్ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చితిత్స పొందుతూ రాజారావు మరణించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.