ఏలూరు : (West Godavari) ప్రేమించి.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు ముఖం చాటేశాడు. తన జీవితాన్ని రోడ్డుపైన పడేయవద్దని వేడుకుంటూ ఆ అభాగ్యురాలు అత్తింటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటున్నది. పెండ్లి అయిన కొద్దిరోజులకే ముఖం చాటేయడంతో పాలుపోని ఆమె.. అక్కడే దీక్షకు కూర్చున్నది.
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన ప్రవీణ్ కుమార్, ఆరేపల్లి సత్యవతి ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే కాపురం చేశాడు. అయితే, ఉన్నట్లుండి భర్త ముఖం చాటేస్తుండటంతో ఏంచేయాలో తెలియని అగమ్యగోచర పరిస్థితిలో సత్యవతి ఉన్నారు. తన భర్తను తన వద్దకు పంపించాలని గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది. గత కొన్నిరోజులుగా తనకు దూరంగా ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆమె అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న అత్తామామలు ఆమెపైకి దాడికి దిగారు. తిట్లు శాపనార్ధాలు పెడుతూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, భర్త తనకు దక్కేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని సత్యవతి భీష్మించుకు కూర్చున్నది.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..