తిరుమల : తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. గరుడవాహనుడైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 22 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD ) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 75,004 మంది భక్తులు దర్శించుకోగా 23,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.98 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సాయి దుర్గాతేజ్
తిరుమల వేంకటేశ్వరస్వామిని నటుడు సాయి దుర్గాతేజ్ దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు . అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ 2026లో తన పెళ్లి( Marriage) జరుగుతుందని వివరించారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది .