(Mrs India) మిసెస్ ఇండియా 2021 గా విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగాయి. పీజెంట్స్ ప్రైవేట్ ఇండియా ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు 9వ సీజన్ పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మిసెస్ ఇండియా టైటిల్ కోసం పోటీపడగా.. ఈ నెల 23 న జరిగిన ఫైనల్ పోటీల్లో 12 మందిని వెనక్కి నెట్టి విజయవాడ మిసెస్‌కు కిరీటం దక్కింది.
విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక తండ్రిపేరు సుంకర దుర్గాప్రసాద్. ఎంబీఏ చదివారు. 2019 లో శ్రీమతి అమరావతి టైటిల్‌ను గెల్చుకున్న మల్లిక.. గత ఏడాది వర్చువల్‌గా నిర్వహించిన మిసెస్ ఏపీ పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. ఏపీకి చెందిన యువతికి మిసెస్ ఇండియా 2021 కిరీటం దక్కడం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..