విజయవాడ: విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగోరోజు ఆదివారం అమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో రద్దీ అధికంగా ఉన్నది. దీంతో అమ్మవారి దివ్వదర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పడుతున్నది. కొండపై భాగం నుంచి కింద వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.
శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. సాయంత్రం కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. కైలాసవాహనంపై ఆసీనులై దేవాతామూర్తులు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. రాత్రి ఆలయ పురవీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం జరుగనుంది.