అమరావతి : నిన్న రాత్రి విజయనగరంలో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఒకరిని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ దీపిక వెల్లడించారు. లైంగిక దాడిపై వచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఉపాధి కోసం వచ్చిన మహిళ విజయనగరంలో టీ దుకాణం నిర్వహిస్తుంద ని, మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటుందని వివరించారు.
బాధితురాలు తన స్నేహితునితో కలిసి ఉండగా ఇద్దరు దుండగుల్లో ఒకరు సోమవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడు విజయనగరానికి చెందిన వ్యక్తేనని ఎస్పీ తెలిపారు. మహిళ ఫిర్యాదుతో ఘటనలో పాల్గొన్న వారందరిపై కేసు నమోదు చేశామని వివరించారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.