అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ( Meteorological Department ) హెచ్చరించింది. ముఖ్యంగా నెల్లూరు(Nellore) , తిరుపతి (Tirupati) జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red alert) , ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఉన్న అన్ని పోర్టులలో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది.