అమరావతి : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ (Union Minister Srinivasa Varma ) ఆదివారం తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకోగా ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో కేంద్రమంత్రికి వేదపండితులు వేదాశ్వీరచనం అందజేసి, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలకు(Temples) రక్షణ కల్పిస్తామని రక్షణ కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించేందుకు సంప్రదిస్తున్నామని వెల్లడించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నిస్తుందని తెలిపారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 75,140 మంది భక్తులు దర్శించుకోగా, 28,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చిందని తెలిపారు.
Srisailam | శ్రీశైలంలో శ్రావణమాసోత్సవాలు.. ఆ ఐదురోజులు స్పర్శ దర్శనాలు నిలిపివేత..!