Srisailam | శ్రీశైలంలో శ్రావణమాసోత్సవాలు.. ఆ ఐదురోజులు స్పర్శ దర్శనాలు నిలిపివేత..!
Srisailam | ఈ నెల 5 నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ఆయా విభాగాల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శ్రావణంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది.
Srisailam | ఈ నెల 5 నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ఆయా విభాగాల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శ్రావణంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఆర్జిత అభిషేకాలు, దర్శనాల వేళ్లలో దేవస్థానం పలు మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు భక్తులకు కేవలం స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి పర్వదినాలతో పాటు సోమవారాలు, వారాంతాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఉత్సవాల సమయంలో 16 రోజుల పాటు గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చన, ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ప్రదోషకాలసేవలను నిలిపివేసింది. అభిషేకాలను నిలిపివేసిన ఐదురోజుల్లో రోజుకు నాలుగు విడుతలుగా స్పర్శ దర్శనాలు కల్పించనున్నారు. గతంలో మాదిరిగానే రూ.500 టికెట్లపై దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రద్దీ సాధారణంగా ఉండే రోజుల్లో యథావిధిగా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు కొనసాగుతాయని ఈవో తెలిపారు.
దర్శన టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు srisailadevasthanam.org వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. ఇక ఆలయ ద్వారాలను వేకువ జామున 3 గంటలకు తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి 4.30గంటలకు మహామంగళహారతి సేవ ఉంటుందన్నారు. ఆ తర్వాత దర్శనాలకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమం, మంగళవాయిద్యాలు, ప్రదోషకాల పూజలు, మహామంగళహారతి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు.
Read Also :
-
Srisailam | వీరభద్రా శరణు శరణు..! శ్రీశైలంలో బయలు వీరభద్రుడికి విశేష పూజలు
-
BCCI | సకల హంగులతో కొత్త క్రికెట్ అకాడమీ.. ఫొటోలు చూశారా..!
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

