Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించారు.
రాజమండ్రి నుంచి తిరుపతికి మధ్య అలయన్స్ ఎయిర్ కంపెనీ విమాన సర్వీసులు నడిపించనుంది. వారానికి మూడు రోజులు ఈ విమాన సర్వీసులను నడిపిస్తారు. మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు ఉంటాయి. ఇవాళ తొలి విమానం ఉదయం 7.40 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి 9.25 గంటలకు రాజమండ్రి చేరుకుంది. ఇక ఉదయం 9.50 గంటలకు రాజమండ్రి నుంచి బయల్దేరి 11.20 గంటలకు తిరుపతి చేరుకుంది.
VIDEO | Delhi: Union Minister Kinjarapu Rammohan Naidu virtually inaugurated the new flight service from Rajahmundry to Tirupati at Rajiv Gandhi Bhavan.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/fxLHARGejs
— Press Trust of India (@PTI_News) October 1, 2025
కాగా, ఈ విమాన సర్వీసులను వర్చువల్గా ప్రారంభించిన అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేవీ నవరాత్రుల్లో తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. విమాన టికెట్ ధర మొదటి 35 సీట్లకు రూ.1999గా నిర్ణయించారని.. తర్వాత 35 సీట్లకు రూ.4 వేలుగా ఉండనుందని తెలిపారు. ఈ ఆఫర్ మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబైకి ప్రారంభించిన విమాన సర్వీసులు ఫుల్ అవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో షిర్డీ, వారణాసి, కొచ్చి తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు.