పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది. దీంతో భయాందోళనలకు గురైన మహిళ కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మీ దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం క్షత్రియ సేవా సమితికి ఆర్థికసాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సేవాసమితి వారు ఇంటి నిర్మాణం కోసం టైల్స్ అందజేశారు. మరోసారి ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేయడంతో విద్యుత్ సామగ్రికి బదులు పార్శిల్లో మృతదేహం వచ్చింది. దీంతో వారు పోలీసుకు ఫిర్యాదు చేశారు.