Ganesh Immersion | ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వినాయకుడి నిమజ్జనంలో అపశృతి నెలకొంది. కొత్తపట్నం మండలం మోటుమాల వద్ద గణేశుల నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. వినాయక నిమజ్జనం కోసం శనివారం మధ్యాహ్నం మోటుమాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నాగరాజు, పాలచందర్ వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు సముద్రంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన సహాయక సిబ్బంది.. తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు నిర్ధారించారు.