అమరావతి : ఏపీలోని బాపట్ల(Bapatla) జిల్లా నల్లమడ వాగులో గల్లంతైన మరో ఇద్దరి మృతదేహాలను (Dead Bodies) గురువారం వెలికితీశారు. నిన్న ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సూర్యలంక బీచ్‌కు వచ్చిన నలుగురు నల్లమడ వాగు (Nallamada River) లో ఈత కొట్టడానికి దిగారు. వాగు ప్రవాహంలో నలుగురు గల్లంతు కాగా సునీల్, సన్నీ మృతదేహాలను స్థానిక మత్స్యకారులు బయటకు తీశారు.
గిరి, నందు కోసం వాగులో పోలీసులు మత్స్యకారుల సహాయంతో గాలించిన దొరకక పోవడంతో గురువారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి ఇద్దరి మృతదేహాలు వెలికి తీసి పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్ జగద్గిరిగుట్ట బీరప్ప నగర్, ఈసీఐఎల్‌కు సమీపంలోని నాగారానికి చెందిన వాసులుగా గుర్తించారు.
వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి సరదాగా గడుపుదామని బాపట్ల జిల్లాకు వచ్చారు. నల్లమడ వాగులో స్నానం చేస్తుండగా మునిగిపోతున్న కుమారుణ్ని సన్నీ(13)ని కాపాడటానికి వెళ్లిన తండ్రి సునీల్ కుమార్ (36) , ఇద్దరిని రక్షించడానికి ప్రయత్నించిన ఇద్దరు బంధువులు కిరణ్, నందు మృతి చెందారు.