Lorry Accident | విజయవాడ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీని మరో లారీ వెనక నుండి వేగంగా వచ్చి ఢీకొట్టింది. అదే సమయంలో రోడ్డుపై వస్తున్న కారు, స్కూటీ రెండు లారీల మధ్య నలిగిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీం సాయంతో మృతదేహాలను వాహనాల్లో నుంచి బయటకు తీశారు. గాయాలైన వారిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎక్కువగా వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్టు విజువల్స్ చూస్తే అర్తమవుతోంది.
విజయవాడ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుండి ఢీకొట్టిన మరో లారీ
రెండు లారీల మద్య నలిగిపోయిన కారు, స్కూటీ.. అక్కడికక్కడే ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు pic.twitter.com/zcR0R6Fvry
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026