అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో రైలుకింద పడి తహసీల్దార్ ( Tahsildar Suicide ) ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా పీజీఆర్ఎస్ విభాగంలో పనిచేస్తున్న శ్రీనివాసులు ( Srinivasulu ) 2024లో ఎన్నికల వేళ రామాపురం తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన అవకతవకలపై వీఆర్వోను సస్పెండ్ చేయగా తహసీల్దార్‌ను లక్కిరెడ్డిపల్లెకు పీజీఆర్ఎస్ విభాగానికి బదిలీ చేశారు.
విచారణలో భాగంగా తహసీల్దార్ తప్పులు నిర్దారణ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్యం కారణంతో సెలవు పెట్టి చికిత్సపొందుతున్న ఆయన నిన్న కారుపాడు నుంచి చిత్తూరుకు వస్తున్న రైలు సిద్ధంపల్లెకు చేరుకుంటున్న సమయంలో పట్టాల పైకి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.