Tirumala | తిరుమల నడకదారుల్లో టీటీడీ ఆంక్షలు..! చిరుత దాడి ఘటన నేపథ్యంలో నిర్ణయం..!
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది.
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనం కోసం నడకదారిలో వెళ్తున్న చిన్నారిపై చిరుత దాడి చేయడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల భద్రత విషయంలో టీటీడీ అప్రమత్తమైంది. అయితే, మొక్కుబడి నేపథ్యంలో చాలా మంది భక్తులు నడకదారిన వెళ్తుంటారు.
చిరుత దాడి ఘటన నేపథ్యంలో కొత్తగా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు తీసుకువచ్చింది. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తరలించాలని నిర్ణయించింది. అలాగే వారికి రక్షణగా ముందు వెనుకలా రోప్, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 సంవత్సరాలలోపు పిల్లలకు అనుమతి నిలిపివేసింది. మరో వైపు పోలీసులు ఏడో మైలు వద్ద పోలీసులు పిల్లల చేతికి ట్యాగ్‌లను సైతం వేస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్‌లను వేస్తున్నట్లు తెలిపారు. ట్యాగ్‌పై పిల్లల పేర్లు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్లను అందులో ఉంచుతున్నారు. మరో వైపు ఆరేళ్ల చిన్నారిపై దాడిచేసిన చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు. బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు.
#Tirumala: After the six-year-old was killed by a Leopard, TTD has decided to send 100 devotees as one group along with a security guard on the Alipiri-Tirumala pedestrian route.
Forest dept has setup cage to trap the animal.
Follow @NewsMeter_In @CoreenaSuares2 pic.twitter.com/Ji420wYn9K
— SriLakshmi Muttevi (@SriLakshmi_10) August 12, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

