Supreme Court | మణిపూర్ వెలుపల యూపీఎస్సీ పరీక్షలు రాసే వారికి మూడు వేలు ఇవ్వండి: సుప్రీంకోర్టు
Supreme Court | సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) అరుదైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 26న యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ జరుగనున్నది. అయితే అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్ అట్టుడిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్ వెలుపల పరీక్షా కేంద్రాలను మార్చాలని, రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ 140 మంది అభ్యర్థులు తొలుత ఢిల్లీ హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాగా, మణిపూర్‌లోని కొండ జిల్లాల అభ్యర్థులు ఎంచుకున్న ఇంఫాల్ పరీక్షా కేంద్రాన్ని మార్చడానికి అనుమతిస్తామని మార్చి 29న ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అలాగే వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయడంతోపాటు ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.1500 చొప్పున భత్యం ఇవ్వాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు మణిపూర్ వెలుపల పరీక్షా కేంద్రాలు ఎంచుకున్న, మార్చుకున్న అభ్యర్థుల పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లు చేయాలన్న హైకోర్టు ఆదేశం ఆచరణాత్మకం కాదని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు సూచించిన రోజువారీ భత్యాన్ని రూ. 1,500 నుంచి రూ.3,000కు సుప్రీంకోర్టు పెంచింది. ఈ ప్రయోజనం పొందాలనుకునే మణిపూర్ అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా వారి చిరునామా పరిధిలోని నోడల్ అధికారిని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

