Rain fall : ఇవాళ, రేపు రాయలసీమ కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని, పలుచోట్ల పిడుగులు కూడా పడవచ్చని ఆ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త కరుణ సాగర్ చెప్పారు.
అంతేగాక రాగల ఐదు రోజుల వరకు రాయలసీమ, కోస్తాంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. కానీ తొలి రెండు రోజులు అంటే ఇవాళ, రేపు మాత్రం భారీగా వర్షం పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాగా గడిచిన 24 గంటల నుంచి కోస్తాంధ్రా, రాయలసీమలో చెదురుమొదురు వర్షాలు పడుతున్నాయి.