(TTD achievement) చిత్తూరు : ఎన్నో ప్రత్యేకతలున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నది. ప్రపంచంలోని ఏ ఇతర ఆలయం అందించని విధంగా భక్తులకు సేవలందిస్తున్న టీటీడీ సేవలను ఇంగ్లండ్‌కి చెందిన ఓ సంస్థ గుర్తించింది. టీటీడీ సేవలకు గుర్తింపుగా ఇంగ్లండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ బహూకరించింది. శనివారం తిరుమలలోని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో భేటీ అయిన ఆ సంస్థ ప్రతినిధులు.. ఈ సందర్భంగా ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తున్నదని తెలిపారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60-70 వేల మంది భక్తులకు సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో క్యూలైన్ల నిర్వహణ జరుగుతున్నదని సుబ్బారెడ్డి తెలిపారు. నిత్యం 3.5 లక్షల లడ్డూలు భక్తులకు పంపిణీ చేసేందుకు మంచి వాతావరణంలో తయారు చేస్తున్నట్టు చెప్పారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..