TTD EO Dharma Reddy | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ ధర్మారెడ్డి వారం రోజుల సెలవుపై వెళ్లారు. ధర్మారెడ్డికి ఏడు రోజుల సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులుజారీ చేశారు. సెలవు సమయంలో రాష్ట్రం దాటొద్దని ఆ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పారు.
అయితే సెలవు పూర్తయిన తర్వాత ధర్మారెడ్డి విధుల్లో చేరతారా.. లేదా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెలాఖరులో ధర్మారెడ్డి పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి నమ్మిన బంటుగా చట్ట విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలను ధర్మారెడ్డి ఎదుర్కొంటున్నారు.
కాగా, సీఎస్ గా పని చేసిన జవహార్ రెడ్డి కూడా సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరులో జవహార్ రెడ్డి సర్వీసుల నుంచి రిటైర్ కానున్నారు. ఆయనతోపాటు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేసిన రావత్ కూడా సెలవులో ఉన్నారు.