తిరుమల : టీటీడీ అదనపు ఈవో (Additional EO) సిహెచ్ వెంకయ్య చౌదరి (Venkaiah Chaudhary) ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శన క్యూ లైన్లను పరిశీలించారు. ఇందులో భాగంగా ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద ఉన్న ఎస్ఎస్డీక్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntham Complex) – 1, 2లోని కంపార్ట్మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం ఎస్ఈడీ క్యూ లైన్లను, ఫోటో క్యాప్చర్ తదితరాంశాలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఈ 2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, ఆశాజ్యోతి, ఐటీ అండ్ ట్రాన్స్పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, వీజీవో నందకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు.