తిరుపతి : తిరుమల తరహాలో తిరుచానూరు పద్మావతి(Tiruchanur Padmavati ) అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగనున్నాయని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 28న ధ్వజారోహణం, డిసెంబర్ 2న గజ వాహనం, 3న స్వర్ణరథం, గరుడ వాహనం(Garuda Vahanam ), 6న పంచమితీర్థం, 7న పుష్పయాగం(Puspayagam) నిర్వహిస్తారని చెప్పారు.విశేషమైన పంచమి తీర్థం రోజున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని పేర్కొన్నారు.
ఇందుకోసం టీటీడీ కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినం కావడంతో శని, ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,173 మంది దర్శించుకోగా 32,519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.50 కోట్లు వచ్చిందని అన్నారు .