అమరావతి : చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు(Elephant) దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి (Died) చెందిన ఘటన గుడిపాల మండలం రామాపురంలో చోటు చేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన వెంకటేశ్, సెల్వి దంపతులు పొలంలో పనిచేసుకుంటుండగా ఒక్కసారి వారిపై ఏనుగు దాడి చేసి బీభత్సం సృష్టించింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
అదేవిధంగా సి.కె పల్లిలోనూ ఏనుగు దాడి చేసిన ఘటనలో కార్తీక్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ కార్తీక్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.