అమరావతి : పల్నాడు(Palnadu) జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక మండపంలో విద్యుదాఘాతంతో (Electrocution )యువకుడు మృతి చెందడం కలకలం రేపుతుంది. మండపంలో లైట్లు అమరుస్తుండగా వేదసహాయం (18) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. పండుగపూట గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని ఆసుపత్రికి తలరించారు.