కాకినాడ: కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను రాజమండ్రిలోని అపోలో ఫార్మసీలో పనిస్తున్న వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.