బాపట్ల: ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖాను తలించారు.
తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.