విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
సంగీత ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒడిశాలోని భవానీపట్నం నుంచి విశాపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.