చిత్తూరు : (Veda Ivangel) ఈ చిన్నారి వయసు రెండున్నరేండ్లు కూడా లేదు. అయితేనేం తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఆకట్టుకుంటున్నది. జంతువులు, శరీర అవయవాలను ఇట్టే గుర్తుపట్టేస్తుంది. తన అసాధారణ ప్రతిభతో ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇవే ప్రత్యేకతలు ఈ చిన్నారిని ఇండియన్ యంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా నిలిపింది. అందుకే ఈ చిన్నారి పేరును ఓఎంజీ లో ఎక్కించారు.
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అమరనాథ్, హిమబిందు కుమార్తె వేద ఇవాంజెల్ వయసు రెండున్నరేండ్లు. ఈ చిన్నారి ప్రతిభ చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చిన్ననాటి నుంచి వేద జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లి హిమబిందు.. అందుకు తగినట్లుగా శిక్షణ ఇచ్చింది. దాంతో రెండున్నరేండ్లకే ఎక్కడ లేనంత విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నది. ఈ చిన్నారి టాలెంట్‌ను వీడియోలతో ఓఎంజీకి దరఖాస్తు చేయగా.. వారు లైవ్‌లో పరీక్షించి యాంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా ఎంపికచేశారు. రెండు రోజుల క్రితమే సదరు సంస్థ నుంచి మెడల్, షీల్డ్ అందాయి. తమ చిన్నారి జ్ఞాపకశక్తికి సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేయనున్నట్లు తల్లిదండ్రులు అమరనాథ్, హిమబిందు తెలిపారు. దానికన్నా ముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
రైతుల పాదయాత్రను ఆపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: చంద్రబాబు
సిక్కోలు చిరకాల స్వప్నం నెరవేరుతుంది : ధర్మాన ప్రసాదరావు
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..