తిరుమల: కొవిడ్ తగ్గిన కారణంగా తిరుమలలో భక్తుల సంఖ్య పెరుగుతుంది. రెండేళ్లు స్వామివారిని దర్శించుకునేందుకు ఎదురుచూసిన భక్తులకు కొవిడ్ నిబంధనల సడలింపుతో తిరుమలకు చేరుకుంటున్నారు. కాగా నిన్న 53,163 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 20,651 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ.4.51 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.