అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ (Privatization) ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కుమారస్వామి (Union Minister Kumaraswamy) స్పష్టం చేశారు. ఈ ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని అన్నారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర నాయకులతో కలిస గురువారం స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించటం మా బాధ్యతని అన్నారు. ప్లాంట్‌లోని అన్ని విభాగాలను పరిశీలించామని తెలిపారు. ప్రధాని (Prime Minister) ఆశీస్సులతో ప్లాంట్ వందశాతం సామర్ధ్యతో ఉత్పత్తి చేస్తుందని ధీమాన వ్యక్తం చేశారు.
నాకు రెండు నెలలు సమయమివ్వండి. ప్రధాన మంత్రికి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తరువాత ప్రధాని తీసుకునే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కార్మికులకు ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అంతకు ముందు ప్లాంట్‌లోని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై ప్లాంట్ వివరాలను అడిగి గెలుసుకున్నారు.
AP News | అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య.. డీకంపోజ్ స్థితిలో మృతదేహం
Bandi Sanjay | వైసీపీ నాయకులు వీరప్పన్ వారసులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు