Bandi Sanjay | గత పాలకులు స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగులకు టీటీడీ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు.
శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని.. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులు అని ఆరోపించారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని.. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరాతమని తెలిపారు. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. స