అమరావతి : ఏపీలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర నిందనలతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడే ఏకంగా టీడీపీ పార్టీ ఆఫీసుకే(TDP office) నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా( Palnadu district) బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. మంటల్లో టీడీపీ కాలిబూడిదయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.