అమరావతి : నంద్యాల జిల్లా (Nandyala District) పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్రంగా స్పందించారు. మైనర్ బాలిక హత్యాచార ఘటన నిందితులను వదిలే ప్రసక్తి లేదని వెల్లడించారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
నేరాలను రాష్ట్ర ప్రభుత్వం సహించదని అన్నారు. ఆడబిడ్డల రక్షణకు సంస్థాగత మెకానిజం కావాలని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు పిల్లలను నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఆదివారం గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక అదృశ్యమైంది.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా దీంతో వారు బాలికను అత్యాచారం, హత్య చేసి హంద్రీనీవా(Handrinevaa) సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (Sujala Sravanthi Lift Irrigation ) అప్రోచ్ కాలువలో పడవేసామని అంగీకరించారు. అప్పటి నుంచి పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం వరకు కూడా బాలిక ఆచూకి లభించలేదు.
YS Jagan | వైసీపీకి షాక్.. మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసు నమోదు
Tirumala | తిరుమల కొండపై విరిగిపడిన చెట్టు కొమ్మ.. తీవ్రంగా గాయపడిన యువతి.. వీడియో