తిరుమల: తిరుమలలో (Tirumala) దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆమెను దవాఖానకు తరలించారు. తల, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
తిరుమలలో ప్రాంక్ వీడియోలు.. భక్తులపై అకతాయిల వెర్రిచేష్టలు
తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అకతాయిలు ప్రాంక్ వీడియో లు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు తిరుమల లోపల ప్రాంక్ వీడియో కోసం.. నారాయణగిరి షెడ్స్లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కలరింగ్ ఇచ్చారు. భక్తులు ఆ వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేచారు. వెంటనే సదరు యూట్యూబర్ కంపార్ట్మెంట్ నుంచి నవ్వుతూ పరుగులు తీశాడు.
ఇదంతా మరో యువకుడు వీడి యో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించిం ది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించిం ది. తిరుమల ఆలయంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది.
తిరుమలలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. యువతికి తీవ్ర గాయాలు
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది.
తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. pic.twitter.com/I1WzTdJjfb
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2024