YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్రోత్సాహంతో అప్పటి సీబీఐ డీజీ పీవీ సునీల్‌కుమార్, కొందరు అధికారులు వేధించారని రఘురామకృష్ణ రాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు తెలిపారు. అక్రమ కేసులు బనాయించి తనను కస్టడీలోకి తీసుకోవడమే కాకుండా.. హత్యాయత్నం చేశారని గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు మేరకు ఏ1గా సునీల్‌కుమార్, ఏ2గా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా వైఎస్ జగన్, ఏ 4గా అప్పటి సీబీఐ ఏఎస్పీ విజయ్‌పాల్, ఐ5గా జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు తదితర అంశాలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీటిలో నాన్‌బెయిలబుల్ సెక్షన్లుకూడా ఉన్నట్లు సమాచారం.