TGSRTC| హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఆయా బస్సుల్లో టికెట్ ధరలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీని కల్పించింది. ఈ మేరకు ఆ వివరాలను టీజీఎస్ఆర్టీసీ ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో వెల్లడించింది.
– గరుడ ప్లస్ బస్సుల్లో 30 శాతం తగ్గింపు, ఈ గరుడ బస్సుల్లో 26 శాతం డిస్కౌంట్ టీజీఎస్ఆర్టీసీ కల్పించింది. ఇక సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు తగ్గింపునిచ్చింది. ఇక రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో 16 శాతం రాయితీ ప్రకటించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది.
ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ఆర్టీసీ ట్విట్టర్(ఎక్స్) ద్వారా సూచించింది. https://www.tgsrtcbus.in/ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
Tgsrtc