అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth reddy ) మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రచన అతిథిగృహం వద్ద సీఎంకు తిరుమల (Tirumala), తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రేపు(బుధవారం) ఉదయం రేవంత్రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం మనవడు తలనీలాల సందర్భంగా సీఎం దంపతులు తిరుమలకు చేరుకున్నారు.