అమరావతి : ఏపీ శాసనమండలి నుంచి టీడీపీకి చెందిన 8 మంది సభ్యులను మండలి చైర్మన్ సస్పెన్షన్ చేశారు. వరుసగా మూడోరోజు కూడా టీడీపీ సభ్యులు సారా మరణాలపై చర్చించాలని పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయడంతో వారిని సస్పెండ్ చేశారు. కల్తీసారా, మద్యం ద్వారా జరుగుతున్న మరణాలతో మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని నినాదాలు చేస్తు తాళిబొట్లతో నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి చైర్మన్ 8 మందిని సస్పెన్షన్ చేయడంతో మిగతా టీడీపీ ఎమ్మెల్సీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
ఇటు శాసనసభలోనూ టీడీపీ సభ్యుల నిరసన కొనసాగింది. జంగారెడ్డిగూడెంలో సారా మరణాలు, మద్యపానం నిషేధంపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.