అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో ( Liquor case ) నిందితులకు సుప్రీం కోర్టు ( Supreme Court ) లో నిరాశే ఎదురయ్యింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ నుంచి రెగ్యులర్ బెయిల్ ( Regular Bail ) కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
బుధవారం కేసు విచారణకు రాగా కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచిస్తూ నాలుగు వారాల పాటు గడువు ఇస్తూ నిబంధనలు అనుసరించాలని స్పష్టం చేసింది. గత వైసీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారని, జే బ్రాండ్ పేరుతో ప్రజలను నిలువుదోపిడి చేశారని కూటమి నాయకులు ఆరోపించారు
. అధికారంలోకి వచ్చిన తరువాత నాటి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. ఒకరిద్దరికి ఈ కేసులో బెయిల్ లభించడంతో మరికొందరు జైలులో ఉన్నారు. మరికొందరు నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.