తిరుపతి : తిరుపతి పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. కేవీ పల్లి మండలం గర్నిమిట్లకు చెందిన విష్ణుప్రియ కళాశాల వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం కావొచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రేమ వ్యవహారంలో కుటుంబ పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. పోలీసులు హాస్టల్ కు చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అక్కడ లభ్యమైన ప్రేమ లేఖలు, ప్రియుడు పంపిన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు.