తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి గురువారం రూ. 3.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 32, 613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 15,639 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు.
కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు. కొవిడ్ కట్టడికి టీటీడీ బోర్డు అన్ని చర్యలు తీసుకుంటుందని, భక్తులు సహకరించి మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.