Srisailam | కర్ణాటకను తలపిస్తున్న శ్రీశైలం.. దర్శనాలకు క్యూలైన్లో పడిగాపులు
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాల ఆరంభం అవుతున్నాయి. దీంతో కన్నడ భక్తుల రద్దీతో శ్రీశైల మహా క్షేత్రం కర్ణాటక రాష్ట్రాన్ని తలపిస్తోంది.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాల ఆరంభం అవుతున్నాయి. దీంతో కన్నడ భక్తుల రద్దీతో శ్రీశైల మహా క్షేత్రం కర్ణాటక రాష్ట్రాన్ని తలపిస్తోంది. కన్నడిగుల ఇంటి దైవమైన మల్లన్నను దర్శించుకునేందుకు ప్రతి పల్లె నుండి ముడుపులు కట్టుకుని కాలినడకన క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. దేవస్థానం అధికారులు నెల రోజుల క్రితం నుండి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి దర్శన సమయాలను ఆలయ నిబంధనలను వివరించారు.
ప్రతి యేటా మోలిక వసతులను మెరుగుపరుస్తూ ముందస్తు ప్రణాళికతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుటున్నట్లు శ్రీశైలం ఈవో డీ పెద్దిరాజు చెప్పారు. అంచనాలకు రెట్టింపుగా వస్తున్న యాత్రికులకు దర్శనాలు కల్పించడం కష్టసాధ్యమవుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. శనివారంతో స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపివేసి స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతించడంతో భక్తులందరికి స్వామిఅమ్మవార్ల దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహరం, పాలు, మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు అందిస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు ఇప్పట్లో రావద్దు.. ఈవో
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులు ఉత్సవాలు ముగిసిన తరువాత స్వామి అమ్మవార్ల దర్శనాలకు రావాలని ఈవో డీ పెద్దిరాజు కోరారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో యాత్రికులు వస్తుండటంతో మరో నాలుగైదు రోజుల వరకు రద్దీగానే ఉంటుందని అన్నారు. ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు పలు ఆర్జితసేవా టిక్కెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

